loader

కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం… మంత్రి పదవికి కేఎన్ రాజన్న రాజీనామా

కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం చోటుచేసుకుంది. కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న తన పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీపైనే కేఎన్ రాజన్న తీవ్ర ఆరోపణలు చేశారు. మహాదేవపురలో ఓట్ల చోరీకి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రి సొంత పార్టీపైనే ఆరోపణలు చేయడం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగా మారింది. ఈ క్రమంలోనే మంత్రి పదవి నుంచి కేఎన్ రాజన్న వైదొలగాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించినట్టుగా తెలుస్తోంది.

ఓటుకు పది వేలు ఇస్తున్నారు: పేర్ని నాని

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటు కోసం డబ్బులు పంపిణీ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె, ఎర్రిపల్లి, నల్లగొండువారిపల్లెలలో టీడీపీ నేతలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్‌ స్లిప్‌లను లాక్కుంటున్నారని ఆరోపించారు.ఓటుకు పది వేల రూపాయలు ఆశ చూపుతున్నారు. స్లిప్‌లు ఇవ్వకపోతే ఓటర్లను బెదిరిస్తున్నారు. అంతేకాదు, వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడతామని టీడీపీ కార్యకర్తలు బెదిరిస్తున్నట్టు సమాచారం […]

ఢిల్లీలో టెన్ష‌న్ టెన్ష‌న్‌.. విప‌క్ష ఎంపీల ర్యాలీ, రంగంలోకి పోలీసులు.

బీహార్‌లో ఓటర్ల జాబితా మార్పులపై నిరసనగా, విపక్ష ఎంపీలు పార్లమెంట్‌ భవనం వద్ద నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం దిశగా ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ముందుండగా, అనేక విపక్ష నేతలు ఏకతాటిపైకి వచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు దొంగ‌లించారని ఆరోపిస్తూ, ఎంపీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంలో, ఎన్నికల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతూ, బీహార్‌ ఓటర్‌ లిస్టులో జరిగిన మార్పులను రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్ 6 గ్యారంటీలతో దిగజారిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ- కేటీఆర్ విమర్శలు

తెలంగాణ అభివృద్ధిలో తీవ్రమైన క్షీణత కనిపిస్తోంది. ఇదంతా చూడాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు అని తాజా కాగ్ నివేదిక అందుకు అద్దం పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం 6 గ్యారంటీలను ఇచ్చింది. కానీ అదే హామీలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. ఆర్థిక రంగానికి హామీలే తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. తెలంగాణ ప్రభుత్వ ఆదాయం తగ్గుముఖం పడుతోంది, కాంగ్రెస్ నేతల అనుభవ లేమి, పాలనా వైఫల్యంతో తెలంగాణ […]

రాహుల్ గాంధీకి కర్ణాటక CEO నోటీసులు

కర్ణాటక ఎన్నికల్లో ఓట్ల అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) స్పందించారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు సంబంధించిన పత్రాలను అందజేయాలని కర్ణాటక CEO ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే, వాటిపై విచారణ జరుపుతామని ఆయన తెలిపారు. షకున్ రాణి లేదా ఇతర ఏ వ్యక్తులు రెండుసార్లు ఓట్లు వేయలేదని  ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, ఎలాంటి అక్రమాలు జరగలేదని […]

జడ్పీటీసీ ఉప ఎన్నికలపై స్పందించిన జగన్

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును అప్రజాస్వామిక, అరాచకవాది అంటూ ఆరోపించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ బరితెగింపు రాజకీయాలు చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

బీహార్ ఉపముఖ్యమంత్రికి రెండు ఓటర్ ఐడీ కార్డులున్నాయి- తేజస్వీ యాదవ్

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు రెండు ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయని ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు బీహార్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రక్రియలో ఇలాంటి అవకతవకలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని తేజస్వి యాదవ్ విమర్శించారు. దీనికి విజయ్ కుమార్ సిన్హా స్పందిస్తూ.. తాను లఖీసరాయ్‌కు మారిన తర్వాత బాంకీపూర్ జాబితా నుంచి పేరు తొలగించాలని దరఖాస్తు చేసుకున్నానని.. ఇది తనపై కుట్ర అని కొట్టిపారేశారు.

పాతికేళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక.

వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని పులివెందుల గ్రామీణ, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలని తలపిస్తున్నాయి. మూడు దశాబ్దాల్లో పులివెందుల జెడ్పీటీసీ సీటుకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. 1995, 2006, 2013, 2021లో ఎన్నిక ఏకగ్రీవమైంది. చివరిగా 2001లో మాత్రమే ఎన్నిక జరగడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికలతో ఏకగ్రీవాలకు తెరపడింది. ఇరు పార్టీలూ బేరసారాలకు తెరతీసినట్టు తెలుస్తోంది. ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇవ్వడానికి సిద్దమైనట్లు సమాచారం. పులివెందుల, ఒంటిమిట్ట సిట్టింగ్ స్థానాలు […]

అందుకే బీజేపీలో చేరా.. గువ్వల బాలరాజు

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఏ పార్టీలో చేరబోతున్నారనే ఉత్కంఠకు తెర పడింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసిన ఆయన నేడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు కమలం పార్టీ కండువా కప్పి అధికారికంగా గువ్వల‌ బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు.  ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని బాలరాజు తెలిపారు. అందుకే ఆయన ఈ పార్టీని ఎంచుకున్నట్లు […]

రక్త సంబంధానికి అడ్డుగా రాజకీయ గీత..!

ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టడానికి వస్తానని చెప్పినప్పుడు.. తాను హైదరాబాద్‌లో అందుబాటులో లేనని, బెంగళూరులో ఉన్నానని కేటీఆర్ సందేశం పంపారని ఆమె సన్నిహితులు తెలిపారు. ఈ సందేశం అందుకున్న తర్వాత.. కవిత కేటీఆర్‌ను కలవకుండానే రాఖీ పండుగ జరుపుకున్నారు. తమ మధ్య రాజకీయ విభేదాలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఈ పరిణామం వారి మధ్య దూరం పెరిగిందనడానికి సంకేతమని అంటున్నారు. వైఎస్ జగన్, షర్మిల విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON