loader

జైలు నుంచి ఎందుకు ప్ర‌భుత్వాన్ని న‌డ‌పాలి .. ప్ర‌ధాని మోదీ

బీహార్‌లోని గ‌యాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ.. జైలు నుంచి ఎందుకు ప్ర‌భుత్వాన్ని న‌డ‌పాలి అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఒక‌వేళ ప్ర‌భుత్వ ఉద్యోగిని 50 గంట‌ల పాటు జైలులో వేస్తే, అప్పుడు ఆ వ్య‌క్తి త‌న ఉద్యోగాన్ని కోల్పోతున్నాడ‌ని, కానీ సీఎం, మంత్రులు.. జైలులోనే ఉంటూ ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నార‌ని, కొంద‌రు జైలు నుంచే ఫైళ్లపై సంత‌కాలు చేసేవార‌ని, జైలు నుంచే ప్ర‌భుత్వ ఆదేశాలు ఇచ్చేవార‌న్నారు. ఒక‌వేళ ప్ర‌జానేత‌కు అటువంటి వ్య‌క్తిత్వం ఉంటే, అప్పుడు మ‌నం […]

కేంద్రంలో కొత్త బిల్లులపై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఎద్దేవా

తన ట్వీట్‌ను ప్రారంభిస్తూ ప్రకాశ్ రాజ్, “మహాప్రభూ, ఓ చిలిపి సందేహం” అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రవేశపెట్టబోయే కొత్త బిల్లును ఉద్దేశిస్తూ, దాని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందా అనే ప్రశ్నను లేవనెత్తారు. “మీ మాట వినని మాజీ లేదా ప్రస్తుత ముఖ్యమంత్రిని అరెస్టు చేసి, మీకు నచ్చిన ఉప ముఖ్యమంత్రిని కుర్చీలో కూర్చోబెట్టే యోజన ఏదైనా ఉందా?” అని ఆయన నిలదీశారు.

అటవీ శాఖ సిబ్బందిపై దాడి, జనసేన ఇన్‌ఛార్జి రౌతు అశోక్, ఎమ్మెల్యే పై కేసు నమోదు

శ్రీశైలం ఎమ్మెల్యేపై అటవీ శాఖ సిబ్బంది తో జరిగిన వాగ్వాదం, అనంతరం దాడి ఘటనలో పోలీసులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు,ఆయనను ఏ2 నిందితుడిగా చూపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా శ్రీశైలం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి రౌతు అశోక్ పేరును పోలీసులు నమోదు చేశారు. అశోక్ జనసేన నాయకుడైనా, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన రాత్రి ఎమ్మెల్యేతో కలిసి ఉన్నారని, ఉద్యోగులపై […]

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్‌పై బొత్స క్లారిటీ

ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపై వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి CP రాధాకృష్ణన్‌కు వైసీపీ మద్దతిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్ధమైన పదవులకు నెంబర్ గేమ్ ఉండకూడదనేదే వైసీపీ విధానమని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ స్థాపించిప్పటి నుంచి తాము ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

టీవీకే మహానాడులో స్పృహ‌త‌ప్పి పడిపోయిన 400 మంది.. 12 మంది పరిస్థితి విషమం

మదురైలో గురువారం (ఆగస్టు 21న) నిర్వహించిన తమిళగ వెట్రి కళగం రెండో మహానాడు భబహిరంగ సభలో రద్దీ ఏర్పడి.. తోపులాట జరిగింది,400 మంది అభిమానులు, కార్యకర్తలు స్పృహ‌త‌ప్పి పడిపోయారు. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైనవారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అంతకు ముందు విజయ్‌ జెండా ఎగురవేసేలా 100 అడుగుల పోల్‌ను ఏర్పాటు చేస్తుండగా విరిగి కారుపై పడింది… అందులో ఉన్న […]

సింహం సింగిల్‌గానే వస్తుంది.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది మనమే.. మధురై సభలో టీవీకే విజయ్

తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ మధురైలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తమ పార్టీ ఏ ఇతర పార్టీతోనూ కలవదని, బీజేపీతో కలుస్తుందనే అపోహలను ఆయన ఖండించారు.టీవీకే ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఇది ప్రజల పార్టీ అని విజయ్ నొక్కిచెప్పారు. తన పార్ట ఎన్నికలకు సిద్ధంగా ఉందని అధ్యక్షుడు విజయ్ తెలిపారు. తమిళ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, వారి మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధిస్తామని విజయ్ […]

ఆ ఎమ్మెల్యేపై కేసు పెట్టండి.. అధికారులకు పవన్ కళ్యాణ్

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఆ ఎమ్మెల్యేపై కేసు పెట్టాలని.. సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఎవరైనా.. కూటమి ప్రభుత్వం విడిచిపెట్టదని తేల్చి చెప్పారు.

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు

కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ (ZPTC) స్థానాల్లో జరిగిన ఇటీవల ఉప ఎన్నికల్లో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. పులివెందుల నుంచి బీటెక్ రవి అర్ధాంగి లతారెడ్డి, ఒంటిమిట్ట నుంచి ముద్దు కృష్ణారెడ్డి విజేతలుగా నిలిచారు. గెలుపొందిన లతారెడ్డి, ముద్దు కృష్ణారెడ్డి గురువారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ విజయాన్ని ఆయనకు అంకితం చేస్తూ, భవిష్యత్తులో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని […]

ఇక జైలుకు వెళ్తే.. పదవి ఊడినట్లే.. సీఎం టూ పీఎం.. మంత్రులకూ వర్తింపు..!

130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ బిల్లుతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 239AAలో 5A సెక్షన్‌ని జోడించనున్నారు. ఐదేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడే తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను.. ఈ కొత్త బిల్లు చట్టరూపం దాలిస్తే పదవులనుంచి తొలగించవచ్చు. 30 రోజుల పాటు కస్టడీలో ఉండి, బెయిల్ పొందకపోతే వారు వెంటనే పదవిని వదులుకోవాలి.  31వ రోజున వారిని పదవి నుంచి తొలగించినట్లు పరిగణిస్తారు. తరువాత నిర్దోషిగా తేలితే మాత్రం. వారు తిరిగి నియమితులయ్యే […]

సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భేటీ

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియోపై ఈ భేటీలో చర్చ జరిగింది. ఈ ఆడియో వ్యవహారం పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి దగ్గుపాటి ప్రసాద్‌ను వివరణ కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ అంతర్గత విభాగాన్ని ఆదేశించారు. ఈ ఆడియో వెనుక ఉన్న కారణాలు, […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON