130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ బిల్లుతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 239AAలో 5A సెక్షన్‌ని జోడించనున్నారు. ఐదేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడే తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను..
ఈ కొత్త బిల్లు చట్టరూపం దాలిస్తే పదవులనుంచి తొలగించవచ్చు. 30 రోజుల పాటు కస్టడీలో ఉండి, బెయిల్ పొందకపోతే వారు వెంటనే పదవిని వదులుకోవాలి. 31వ రోజున వారిని పదవి నుంచి తొలగించినట్లు పరిగణిస్తారు. తరువాత నిర్దోషిగా తేలితే మాత్రం. వారు తిరిగి నియమితులయ్యే అవకాశం ఉంది.

