శ్రీశైలం ఎమ్మెల్యేపై అటవీ శాఖ సిబ్బంది తో జరిగిన వాగ్వాదం, అనంతరం దాడి ఘటనలో పోలీసులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు,ఆయనను ఏ2 నిందితుడిగా చూపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా శ్రీశైలం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి రౌతు అశోక్ పేరును పోలీసులు నమోదు చేశారు. అశోక్ జనసేన నాయకుడైనా, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన రాత్రి ఎమ్మెల్యేతో కలిసి ఉన్నారని, ఉద్యోగులపై దాడి కూడా చేశారని బాధితులు వివరించారు.

