loader

నిండు నూరేళ్లు వర్థిల్లు – పవన్‌కి సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్

మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం… అణువణువునా సామాజిక స్పృహ… మాటల్లో పదును… చేతల్లో చేవ… జన సైన్యానికి ధైర్యం… మాటకి కట్టుబడే తత్వం… రాజకీయాల్లో విలువలకు పట్టం….స్పందించే హృదయం…  అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు – ఏపీ సీఎం

ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. మత పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ దంపతులు, వైఎస్సార్ అర్ధాంగి విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

లండన్ లో హరీష్ రావు..ఇదేం ట్విస్ట్..?

ఆదివారం అర్థరాత్రి వరకూ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టుపై తీవ్రంగా పోరాడిన హరీష్ రావు, సోమవారం సాయంత్రానికే లండన్‌లో ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై చర్చించేందుకు ఉదయం ఫామ్‌హౌస్‌కు వెళ్లిన నేతల్లో హరీష్ రావు లేకపోవడంతో ఆయన ఎక్కడ ఉన్నారన్న సందేహాలు మొదలయ్యాయి. అయితే లండన్ విమానాశ్రయంలో ఆయనకు ఎన్నారై కార్యకర్తలు స్వాగతం పలికిన ఫోటోలు బయటకు రావడంతో ఆయన విదేశాల్లో ఉన్న సంగతి స్పష్టమైంది.

హరీష్‌రావుకు మద్దతుగా కేటీఆర్ ట్వీట్..! ఎమ్మెల్సీ కవిత ఆరోపణల తర్వాత..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు అప్రతిష్ట రావడానికి కారణం హరీష్‌ రావు అని ఆరోపణలు చేసిన తర్వాత కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. డైనమిక్ లీడర్ హరీష్‌ ఇచ్చిన మాస్టర్ క్లాస్ అంటూ BRS పెట్టిన పోస్ట్‌ను కేటీఆర్‌ రీ పోస్ట్ చేశారు. నీటిపారుదల గురించి కాంగ్రెస్ నేతలకు హరీష్‌ రావు ఒక్కరే క్లాస్‌ పీకారంటూ ఓ వీడియోను బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారిక ఎక్స్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశారు.

త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తాం : రాహుల్ గాంధీ

ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇటీవల తాము అణుబాంబు పేల్చామని, త్వరలో మరింత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు పేలుస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గడ్డు పరిస్థితులు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు. బీహార్‌లోని పాట్నాలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రేవంత్‌ను కరెన్సీ మేనేజర్ అన్న కెటిఆర్.. రాహుల్‌కు సూటి ప్రశ్న..

‘‘తెలంగాణలో కరెన్సీ మేనేజర్(సిఎం) కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తారట.గతంలో రాహుల్ గాంధీ దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలను అంతం చేసే సెల్స్ అని అన్నారు. మిస్టర్ గాంధీ మీకు తెలుసా.. మీ సిఎం ఏం చేస్తున్నారో..? ఇలా ఎంత బెదిరించినా.. భయపడేది లేదని.. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తాం. ప్రజలపై, న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది’’ అని కెటిఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో పాటు గతంలో రాహుల్ చేసిన పోస్ట్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆయన జత […]

అమిత్‌ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మహిళా ఎంపీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు!

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రాయ్‌పూర్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి మహువా మొయిత్రాపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. స్థానిక నివాసి, బిజెపి నాయకుడు గోపాల్ సమంతో ఫిర్యాదు మేరకు శనివారం మానా పోలీస్ స్టేషన్‌లో బిఎన్‌ఎస్ సెక్షన్లు 196, 197 కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ సెక్షన్లు మతం, జాతి లేదా జన్మస్థలం వంటి కారణాలతో వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, జాతీయ సమైక్యతకు పక్షపాతపూరిత ప్రకటనలు […]

మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ రిలీఫ్

వైసీపీ నాయకుడు, కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని బెయిల్ షరతుల గడువు నేటితో ముగిసింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై జరిగిన దాడి కేసులో బెయిల్ పొందిన కొడాలి నాని, ఈ కేసులో కోర్టు విధించిన షరతుల నుంచి విముక్తి పొందారు. ఈ కేసులో కోర్టు మొదట ప్రతి మంగళవారం, శనివారం గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేయాలని షరతు విధించింది.  ఆయన ఇకపై […]

మామూలు ట్విస్ట్ కాదుగా.. జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్ అభ్యర్థి అతనేనా..

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫారసు చేస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే లిస్ట్‌లో అమీర్ అలీ ఖాన్ పేరు తొలగించి..అజారుద్దీన్‌కు స్థానం కల్పించింది ప్రభుత్వం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నుంచి మజ్లిస్ అభ్యర్థిగా పోటీచేసిన నవీన్ ​యాదవ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు కీలకంగా ఉన్న నేపథ్యంలో మజ్లిస్ పార్టీ మద్దతు కూడా తప్పనిసరి. ఈ క్రమంలోనే.. నవీన్ యాదవ్ పేరు తెరపైకి […]

తాడిపత్రి పర్యటనకు పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి కి తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంపై స్థానిక టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పెద్దారెడ్డి రాకను తాను అడ్డుకోవడం లేదని, కానీ గతంలో ఆయన అక్రమాలకు, దౌర్జన్యాలకు బలైన బాధితులే వ్యతిరేకిస్తున్నారని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతోమంది టీడీపీ కార్యకర్తలపై పీడీ యాక్ట్ కింద అక్రమ కేసులు నమోదు చేయించి, జిల్లా నుంచి బహిష్కరించాడు” అని విమర్శించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON