loader

నిర్మల్‌లో సిఎం.. ఉమ్మడి ఆదిలాబాద్‌కు వరాల జల్లు

నిర్మల్ ప్రజలు ఇచ్చిన భరోసా, మద్దతు వల్లే సిఎం అయ్యాను అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని సిఎం పేర్కొన్నారు. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్‌ జిల్లాకు నిధులు ఇస్తాం. పారిశ్రామికంగానూ అదిలాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. బాసర ఐఐఐటిలోనే యూనివర్సిటీ ఏర్పాటుకు ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లిని కోరుతున్నా అని సిఎం తెలిపారు.

గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడు.. ఇండిపెండెంట్‌గా గెలుపు

జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడు శ్రీకాంత్ పంగర్కర్, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు. జల్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాడు. ఫలితాలు వెలువడిన తర్వాత తన మద్దతుదారులతో కలిసి విజయోత్సవాలు జరుపుకున్నాడు. గౌరీ లంకేష్ హత్య కేసులో ఇప్పటి వరకు తనకు ఎలాంటి శిక్ష పడలేదని శ్రీకాంత్ పంగర్కర్ తెలిపాడు. న్యాయ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని పేర్కొన్నాడు. జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త అయిన గౌరీ లంకేష్‌ను 2017 సెప్టెంబర్ 5న కర్ణాటకలోని బెంగళూరులో ఇంటి […]

చనాక, కొరాటా పంప్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం దశాబ్దాల కల నెరవేరుస్తూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భోరజ్ మండలం హతిఘాట్ వద్ద చనాక-కొరాటా పంప్ హౌస్‌ను ఘనంగా ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామని ,ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. పంప్ హౌస్ ప్రారంభించిన అనంతరం, ముఖ్యమంత్రి స్విచ్ ఆన్ చేసి లోయర్ పెనుగంగ ప్రాజెక్టు ప్రధాన కాలువకు సాగునీటిని విడుదల చేశారు.

ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి

బీజేపీ మొత్తం మహారాష్ట్రతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా అధికారం చేపట్టబోతోందని స్పష్టమైంది. ముంబై మేయర్ పదవిని బీజేపీయే చేపట్టనుంది. మరోవైపు, ఉద్ధవ్ థాకరే ముంబైపై ఏళ్లుగా కొనసాగుతున్న ఆధిపత్యానికి తెరపడనుంది. BMCలోని 227 సీట్లలో210 సీట్ల ట్రెండ్స్-బీజేపీ 90,ఏక్‌నాథ్ షిండే శివసేన 28, ఉద్ధవ్ థాకరే శివసేన UBT 57, రాజ్ థాకరే MNS 9, అజిత్ పవార్ NCP 3, కాంగ్రెస్ 15 సీట్లలో ఆధిక్యంలో ఉంది

ముంబయి పోల్స్‌లో ‘మహాయుతి’ లీడ్‌- ఓటర్లపై ఈసీ గ్యాస్ లైటింగ్ చేస్తోందన్న రాహుల్

ఎన్నికల సంఘం గ్యాస్ లైటింగ్ చేస్తూ దేశ పౌరులను మానసిక గందరగోళంలోకి నెడుతోందని ఆరోపిస్తూ ముంబయి పోల్స్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈసీ చేష్టల వల్ల భారత ప్రజాస్వామ్యంపై ప్రజలు విశ్వాస భావనను కోల్పోయారని విమర్శించారు. ఓట్లచోరీకి పాల్పడటం దేశ వ్యతిరేక చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. పోలింగ్‌లో నాసి రకం ఇంకుతో కూడిన మార్కర్లను వినియోగించడంపై విపక్షాలు, ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారంటూ ఓ వార్తా కథనం  తన ట్వీట్‌లో రాహుల్‌గాంధీ […]

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆరోపణలపై విచారణ జరపనుంది. రెండు వారాల్లో తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని, ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. స్పీకర్ కు చివరి అవకాశం.. ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని, 2 వారాల్లో మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది.

చంద్రబాబు హింసా రాజకీయాలు.. మూల్యం చెల్లించక తప్పదని వైఎస్‌ జగన్‌ హెచ్చరిక

ఏపీలోని గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త, దళితుడు మందా సాల్మన్‌ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్‌బుక్‌ రాజ్యాంగం, పొలిటికల్‌ గవర్నెన్స్‌ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హింసారాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబును ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని, ఇలాంటి ఘటనలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని […]

ఆ రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవాళ ప్రారంభం కావడం సంతోషం: కేటీఆర్

చనాక కొరాట, సదర్‌మాట్ ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధం కావడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ప్రారంభమై.. 90 శాతానికి పైగా పనులు పూర్తి చేసుకున్న రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవాళ ప్రారంభం కావడం సంతోషదాయకమని అన్నారు. 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించిన చనాక కొరాట బరాజ్ బీఆర్ఎస్ హయాంలోనే 95% పనులు పూర్తయ్యి, సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ కూడా అయ్యిందని తెలిపారు.

ముంబైలో బీజేపీ.. థానేలో శివ‌సేన ముందంజ‌

మ‌హారాష్ట్ర మున్సిప‌ల్ ఎన్నిక‌ల్ల బీజేపీ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. డిప్యూటీ సీఎం ఏక‌నాథ్ షిండే తో జ‌త‌క‌ట్టిన బీజేపీ దాదాపు అన్ని మున్సిపాల్టీల్లో ఆధిక్యంలో ఉన్న‌ది. ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో బీజేపీ ముందంలో కొన‌సాగుతున్న‌ది. పుణెలో బీజేపీ ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తున్న‌ది. 32 స్థానాల్లో ఆ పార్టీ లీడింగ్‌లో ఉన్న‌ది. షిండేకు ప‌ట్టున్న థానేలో శివ‌సేన లీడింగ్‌లో ఉన్న‌ది. 131 వార్డుల‌కు గాను 9 వార్డుల్లో ఆ పార్టీ ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది.

రాష్ట్ర ప్రజలకు కనుమ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా అన్నదాతలకు కనుమ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి సంబరాల్లో మూడవ రోజైన కనుమను రైతులు తమకు చేదోడు వాదోడుగా ఉండే పశువుల పట్ల కృతజ్ఞత చూపే రోజని ఆయన గుర్తుచేశారు. ఈ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ప్రకృతికి మరియు మానవుడికి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కొనియాడారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON