loader

రాముడిపై విషం చిమ్మితే మట్టికొట్టుకుపోతారు – ప్రకాష్‌ రాజ్‌కి నాగబాబు కౌంటర్

నటుడు ప్రకాష్ రాజ్ రామాయణాన్ని వక్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఘాటుగా స్పందించారు. ‘శ్రీరామచంద్రుడు కేవలం హిందువుల దైవం మాత్రమే కాదు, ఆయన ధర్మానికి ప్రతిరూపం. రాముడిని తక్కువ చేయాలని చూడటం ధైర్యం కాదు అది అహంకారం,  రామ నామాన్ని ఎగతాళి చేసేవారు తమను తాము గాయపరుచుకుంటారు తప్ప, ధర్మాన్ని ఏమీ చేయలేరు. చరిత్రలో అధర్మం వైపు నిలిచిన వారు ఎలా కాలగర్భంలో కలిసిపోయారో, రాముడిపై విషం చిమ్మే వారి గమ్యం కూడా అలాగే […]

మేటాలో భారీ లేఆఫ్స్… 8,000 ఉద్యోగులు అవుట్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మేటా మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. మే 20న ప్రారంభమయ్యే తొలి విడత లేఆఫ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 10 శాతం అని నివేదికలు చెబుతున్నాయి. ఏఐ ఆధారంగా సంస్థ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చాలనే వ్యూహంలో భాగంగా ఉద్యోగులను తగ్గించే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మా సముద్రాన్ని కాపాడండి..

బాపట్ల జిల్లాలోని వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో పర్యాటక అభివృద్ధి పేరుతో జరుగుతున్న కార్యకలాపాల పట్ల స్థానిక మత్స్యకారులు ఆందోళనకు దిగారు. “దివే చీరాల ఎల్‌ఎల్‌పీ” పేరిట బోటింగ్ నిర్వహణకుస్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారుల సహకారంతో పనులు జరుగుతున్నాయని పనులు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్ట్ వల్ల వారి వేట మార్గాలు, పడవల నిల్వ ప్రదేశాలు దెబ్బతింటాయి. జీవనాధారం కోల్పోయే పరిస్థితి వస్తుందని మత్స్యకారులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం […]

ఆగని ట్రావెల్ బస్‌ అగ్ని ప్రమాదాలు! స్లీపర్స్‌పై నిషేధానికి పెరుగుతున్న డిమాండ్

గచ్చిబౌలి నుండి పాలకొల్లుకు బయల్దేరిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సుకొండాపూర్, మియాపూర్ మీదుగా కేపీ హెచీ (KPHB) ప్రాంతానికి చేరుకోగానే, ఇంజిన్ భాగంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. బస్సులో పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దిగిపోవాల్సిందిగా హెచ్చరించారు. అందరూ కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం

అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం) ( World Heritage Day) ప్రతి ఏట ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాలు వారసత్వ సంపద పరిరక్షణకోసం ఒకరికొకరు వివిధ అంశాలలో పరస్పరం సహకరించుకోవాలన్న ప్రధానలక్ష్యంతో ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏర్పాటుచేయబడింది.

వీగిన మహిళా బిల్లు.. రేపు బీజేపీ నిరసనలు

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం తో రేపు బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. మహిళా బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్, విపక్షాలే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. విపక్షాల తీరుకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. దేశంలో మహిళా సాధికారత సాధించడం కాంగ్రెస్ పార్టీకి, విపక్షాలకు ఇష్టం లేదని..డీలిమిటేషన్ పై తప్పుడు ప్రచారం చేస్తూ బిల్లు వీగిపోయేలా చేశారని బీజేపీ ఆరోపించింది. మహిళా బిల్లు విషయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీనే ప్రధానంగా టార్గెట్ చేసినట్టు […]

పరువు పొగొట్టుకున్న ఏపీ పార్టీలు-దక్షిణాదికి వ్యతిరేకంగా వెళ్లి..!

కేంద్రం ఎప్పుడైతే మహిళా బిల్లు ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా తెచ్చే ప్రయత్నం చేసిందో అప్పుడే దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు కేరళలో ఎల్టీఎఫ్, యూడీఎఫ్ కూటములు, కర్నాటకలో అధికార కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే, మిత్రపక్షాలు, తెలంగాణలో విపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ ఇలా పలు పార్టీలు ఈ బిల్లుల్ని వ్యతిరేకించాయి. అయితే ఏపీలో మాత్రం అధికార టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు విపక్ష వైఎస్సార్సీపీ కూడా మద్దతిచ్చింది. ఇప్పుడు బిల్లు వీగిపోవడంతో ఆంధ్రా పార్టీలు పరువు […]

ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్ లోయలో పడ్డ ఘటనలో 10 మంది మృత్యువాతపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు జిల్లాలోని వాల్పరయ్ ఘాట్ రోడ్డులో దుర్ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి వేగంగా వెళ్లి లోయలో పడిపోయింది. పైనుంచి కిందపడడంతో వ్యాన్ నుజ్జునుజ్జయింది. వ్యానులో ఉన్న పది మంది అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన […]

మొదటిసారిగా ‘బి.టెక్ ఎల్.ఎల్.బి (ఆనర్స్)’ కోర్సు ప్రారంభం!

హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యాసంస్థ మహీంద్రా విశ్వవిద్యాలయం, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని బి.టెక్ ఎల్.ఎల్.బి. (ఆనర్స్) అనే ఒక వినూత్నమైన ఇంటిగ్రేటెడ్ కోర్సును ప్రారంభించింది. నేటి మారుతున్న ప్రపంచంలో కేవలం న్యాయశాస్త్ర పరిజ్ఞానం మాత్రమే సరిపోదని, సాంకేతిక అంశాలపై కూడా పట్టు ఉండాలని భావించి ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఆసక్తి గల విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ https://admission.mahindrauniversity.edu.in సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు మరియు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇది ప్రజాస్వామ్య విజయం

రాజ్యాంగ సవరణ బిల్లు (131వ సవరణ) లోక్ సభలో వీగిపోయింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఘాటుగా స్పందించారు. “ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం” అని ఆమె అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టి, దేశ రాజకీయ మ్యాప్ను మార్చాలని చూసిన ప్రభుత్వ కుట్రను విపక్షాలు ఐక్యంగా అడ్డుకున్నాయని ఆమె పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ మహిళల కోసం నిలబడని వారే ఇప్పుడు విపక్షాలను ‘మహిళా వ్యతిరేకులు’ అని పిలవడం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON