హైడ్రాను పీకి చెరువులో పడేస్తాం.. జగిత్యాల సభలో కేసీఆర్
గ్రామ పంచాయతీలను నాశనం పట్టించారని.. మున్సిపాలిటీలను మురికి కూపం పట్టించారని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. మరి ఏం సక్కగుందని ప్రశ్నించారు. ఈ అందానికి బోడి ముండ హైడ్రాను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో హైడ్రా ఉందని.. మీకేం కావాలి.. పేదోళ్ల కొంపలు కూల్చడమేనా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయమని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజుల్లోనే హైడ్రాను ఎత్తి అవతల పడేస్తామని హామీ ఇచ్చారు.

