సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఆయనపై చర్యలు తీసుకుంది. గత ఎన్నికల్లో వైకాపా తరఫున ప్రచారం చేసినట్లు వెంకట్రామిరెడ్డిపై ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నట్లు రుజువైంది. ఇప్పటికే వెంకట్రామిరెడ్డి రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్నాడు. తాజాగా డిస్మిస్ చేయడంతో రిటైర్మెంట్ బెనిఫిట్‌లు కూడా కోల్పోయాడు.

