జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. డ్రోన్ ఎగురవేసి.. ఏరియల్ వ్యూ ద్వారా మేడిగడ్డను సిఎం పరిశీలించారు. సిఎం రేవంత్ తోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎన్డిఎస్ఎ చైర్మన్ అనిల్ జైన్, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సిఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు

