ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై లక్ష్మీపార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కన్నతండ్రి ఎన్టీఆర్‌పై చెప్పులేసి అవమానిస్తుంటే భువనేశ్వరి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఏనాడైనా మీ మేనత్తలు మీ ఇంటికి వచ్చారా..? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. మీ అమ్మకు వారంటే అయిష్టమని, అసలు మీ మేనత్తలు ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా..? అని వ్యక్తిగత విమర్శలు చేశారు. ‘ఏనాడైనా అమ్మమ్మా అంటూ నా దగ్గరకు వచ్చావా..? అసలు నా పుట్టిన రోజు ఎప్పుడో నీకు తెలుసా..?’ అని ప్రశ్నించారు.

