loader

సోష‌ల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తున్న విజ‌య్-ర‌ష్మిక ఫొటోలు ..ఏకంగా 28 మిలియ‌న్ వ్యూస్

టాలీవుడ్ స్టార్ క‌పుల్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మికలు పెళ్లి అనంతరం నూతన దంపతులు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వివాహ వేడుక ఫోటోలను షేర్ చేస్తూ రష్మిక హృదయాన్ని తాకే సందేశాన్ని పోస్ట్ చేశారు. ర‌ష్మిక పోస్ట్‌కి 15 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ రాగా,విజ‌య్ దేవ‌ర‌కొండ పెట్టిన పోస్ట్‌కి కొద్ది గంట‌ల‌లోనే 13 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. అంటే ఇద్ద‌రికి క‌లిపి 28 మిలియ‌న్స్‌కి పైగానే వ్యూస్ వ‌చ్చాయి. ఇది స‌రికొత్త రికార్డ్ అంటున్నారు.

ప్రధాని మోదీని కలిసిన రష్మిక, విజయ్‌.. రిసెప్షన్‌కు ప్రత్యేక ఆహ్వానం

విజయ్, రష్మికలు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న రిసెప్షన్‌కు రావాలని ప్రధానికి ప్రత్యేక ఆహ్వానం అందించారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు. పెళ్లి రిసెప్షన్‌కు రావాలని అహ్వానించారు. ఈ సందర్భంగా ఇన్విటేషన్‌తో పాటు వినాయకుడి విగ్రహాన్ని కూడా ఆయనకు అందించారు. విజయ్, రష్మికల జంట ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పెళ్లయిన వెంటనే అమిత్‌షాను ప్రత్యేకంగా కలిసిన విజయ్- రష్మిక..

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పెళ్లి తంతు పూర్తయిన వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షాను ప్రత్యేకంగా కలిశారు నూతన దంపతులు. సివిల్ డ్రెస్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లారు విజయ్, రష్మిక. తమ వెడ్డింగ్ కు రిసెప్షన్ వేడుకకు రావాలని అమిత్ షాను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గణపతి విగ్రహాన్ని అమిత్ షాకు కానుకగా అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట […]

‘నా భర్త మిస్టర్ విజయ్ దేవరకొండ’- పెళ్లి ఫొటోలు షేర్ చేసిన రష్మిక మంధన్నా

విజయ్ దేవరకొండ- రష్మిక మంధన్నా పెళ్లి ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా గురువారం ఉదయం 10.10 గంటలకు హిందూ సంప్రదాయంలో వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను రష్మిక తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘నా భర్త, మిస్టర్ విజయ్ దేవరకొండను మీ అందరికీ పరిచయం చేస్తున్నాను’ అని క్యాప్షన్ రాసుకొచ్చారు. రష్మిక రెడ్ కలర్ శారీలో కనిపించడగా, విజయ్ సంప్రదాయ పంచకట్టులో ఉన్నారు. రాజసం ఉట్టిపడేలా విజయ్ కాళ్లు, చేతులకు కడియాలు, […]

‘రై రై రారా’ లోడింగ్.. రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్ వ‌చ్చింది. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ ‘చికిరి చికిరి’ చార్ట్‌బస్టర్‌గా నిలవగా, ఇప్పుడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ ‘రై రై రారా’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 2న ఈ మాస్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది

అయ్యప్పమాలలో ప్రీ వెడ్డింగ్ పార్టీకి రామ్ చరణ్.. వివాదంపై స్పందించిన అల్లు శిరీష్

అల్లు శిరీష్‌-నయనికల ప్రీ వెడ్డింగ్ పార్టీకి అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ పాల్గొనడంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మద్యం, మాంసం ఉంటాయని పార్టీకి ఎలా వచ్చాడని ప్రశ్నిస్తున్నారు. ‘ మా పార్టీ ప్రారంభం కాకముందే రామ్ చరణ్ అక్కడికి వచ్చి వెళ్లిపోయాడు. ఆ సమయానికి అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేదు. రామ్ చరణ్ కూడా కేవలం హాల్ వరకు మాత్రమే వచ్చాడు. రామ్ చరణ్ వెళ్లిన తర్వాతే పార్టీ మొదలైంది […]

‘కల్కి 2’లో అమితాబ్- కమల్ బిజీ- 40ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్​లో దిగ్గజ నటులు

బాలీవుడ్ ​మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం హైదరాబాద్​లో ‘కల్కి’ రెండో భాగం పనుల్లో బిజీగా ఉన్నారు. అమితాబ్, కమల్ హాసన్ లాంటి మహానటులు ఒకే తెరపై కనిపించడం అమితాబ్, కమల్ దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసి ఒకే ఫ్రేమ్​లో కనిపించనున్నారు. 1985లో వచ్చిన ‘గేరాఫ్తార్’ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్​లో కనిపిస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే చోట కలుసుకోవడం నిజంగా అరుదైన విషయం.

‘ఉస్తాద్ భగత్​సింగ్’లో పొలిటికల్ రిఫరెన్స్?- క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ హరీశ్

పవర్​స్టార్ పవర్​ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్​సింగ్’ సినిమా వీడియో గ్లింప్స్​లో ‘గాజు ముక్క’, అలాగే ఈ పాటలో పవన్ మేనరిజం చూసి ఈ సినిమాలో పొలిటికల్ రిఫరెన్స్​లు ఉంటాయని పలువురు భావిస్తున్నారు. కొంతమంది ప్రస్తుత రాజకీయాలపై సెటైర్లు, విమర్శలు లాంటివి ఇందులో ఉంటాయా? అని దర్శకుడు హరీశ్​ను అడుగుతున్నారట! అందుకే ఈ అంశంపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇందులో ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి ఎలాంటి రిఫరెన్స్​లు ఉండవని స్పష్టం చేశారు. సినిమా అనేది కేవలం వినోదం […]

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సిఎం

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని రాష్ట్ర డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సోమవారం ప్రజాభవన్‌లో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సిఎం డైరీని ఆవిష్కరించిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ మా సభ్యుల కోసం చేపడుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్ లు, సభ్యుల సంక్షేమం కోసం మా కార్యవర్గం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు.

అల్లు వారింట పెళ్లి సందడి – పవన్ కల్యాణ్, నాగబాబు దంపతులకు ఆహ్వానం

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఇంట వెడ్డింగ్‌ సందడి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్‌ కుమారుడు, టాలీవుడ్ యాక్టర్‌ అల్లు శిరీష్‌ -నయానికా రెడ్డి వివాహం మార్చి 6న జరగనుంది. పవన్ కల్యాణ్‌-అన్నా లెజినోవా దంపతులకు అల్లు అరవింద్‌ దంపతులు, అల్లు శిరీష్ వెడ్డింగ్ కార్డు ఇస్తున్న ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు నాగబాబు దంపతులకు కూడా వెడ్డింగ్ ఇన్విటేషన్‌ అందించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON