అల్లు శిరీష్-నయనికల ప్రీ వెడ్డింగ్ పార్టీకి అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ పాల్గొనడంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మద్యం, మాంసం ఉంటాయని పార్టీకి ఎలా వచ్చాడని ప్రశ్నిస్తున్నారు. ‘ మా పార్టీ ప్రారంభం కాకముందే రామ్ చరణ్ అక్కడికి వచ్చి వెళ్లిపోయాడు. ఆ సమయానికి అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేదు. రామ్ చరణ్ కూడా కేవలం హాల్ వరకు మాత్రమే వచ్చాడు. రామ్ చరణ్ వెళ్లిన తర్వాతే పార్టీ మొదలైంది అని అల్లు శిరీష్ క్లారిటీ ఇచ్చాడు.

