loader

మంగ్లీ జన్మదిన వేడుకలలో విదేశీ మద్యం, గంజాయి

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సింగర్ మంగ్లీ జన్మదిన వేడుకలలో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. మంగ్లీ బర్త్ డే పార్టీ సందర్భంగా ఈర్లపల్లిలో రిసార్టులో స్నేహితులకు మంగళవారం ఆమె పార్టీ ఇచ్చారు. రిసార్టుపై పోలీసులు దాడులు చేయడంతో విదేశీ మద్యం, గంజాయి, మత్తు పదార్థాలు దొరికాయి. మంగ్లీ, రిసార్టు నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కన్నప్ప లో ఆ పేర్లపై కాంట్రవర్సీ

కన్నప్ప మూవీలో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పాత్రల పేర్లు తమ మనోభావాలు దెబ్బతీశాయని.. ఆ పేర్లను తొలగించకుంటే.. రిలీజ్ అడ్డుకుంటామని బ్రాహ్మణ సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. ఇటీవల గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ ఆందోళన నిర్వహించారు. ‘కన్నప్ప’ మూవీలో పేర్ల వివాదంపై మంచు విష్ణు స్పందించారు. తాము ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతో సినిమా తీయలేదని.. రిలీజ్ కాకముందే ఓ నిర్ణయానికి రావొద్దంటూ విజ్ఞప్తి చేశారు.

గ్రాండ్ గా అఖిల్ అక్కినేని, జైనాబ్ రిసెప్షన్

రెండు రోజుల క్రితం వివాహ బంధంతో ఒక్కటైన అక్కినేని అఖిల్, జైనాబ్ గ్రాండ్ రిసెప్షన్ ఇస్తున్నారు. పెళ్లిని మాత్రం కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మాత్రమే చేసిన అక్కినేని కుటుంబం…రిసెప్షన్ కు మాత్రం సినీ, రాజకీయ ప్రముఖులు అందరికీ ఆహ్వానం పలికింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబంతో కలిసి వచ్చి అఖిల్ ను జైనాబ్ ను ఆశీర్వదించారు.

ఎన్నికైన 24 గంటల్లోనే అధ్యక్ష పదవికి సునీల్ రాజీనామా

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే సునీల్ రాజీనామా చేయడం గమనార్హం. తనను సంప్రదించకుండానే కొందరు ప్రకటనలు ఇస్తున్నారని సునీల్ అన్నారు. తన ప్రమేయం లేకుండా ఇచ్చిన ప్రకటనలకు తాను బాధ్యుడిని కాదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా తాను పదవిలో కొనసాగలేనని తెలిపారు.

అల్లు అర్జున్ సినిమాలో దీపికా పదుకోన్…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకోన్‌ను తీసుకున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్‌కి దీపికను తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో దీపిక అయితే సూపర్ ఉమెన్‌గా కనిపించబోతోన్నారనిపిస్తోంది. దీపిక హీరోయిన్ అంటూ వదిలిన అనౌన్మెంట్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

వైభవంగా అఖిల్ జైనాబ్‌ల వివాహం

అఖిల్ అక్కినేని తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పారు. ప్రియురాలు జైనాబ్‌ రవ్జీతో ఆయన వివాహం శుక్రవారం తెల్లవారుజామున వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో అక్కినేని కుటుంబసభ్యులతో పాటు అతిథులు, సినీ ప్రముఖుల సమక్షంలో అఖిల్ వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి దంపతులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నెల 8న రిసెప్షన్ జరగనుంది.

టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నటీమ్.. ‘వీరమల్లు’ వాయిదా?

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భయపడినట్లుగానే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. జూన్ 12న రావాల్సిన ఈ చిత్రం వెనక్కి వెళ్తున్నట్లు టాలీవుడ్ కోడై కూస్తోంది.ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ రద్దుతో పాటు టికెట్ డబ్బులు తిరిగి ఇస్తున్నారన్న వార్తలతో రిలీజ్ వాయిదా ఖాయమని ప్రచారం జరుగుతోంది. రిలీస్ పోస్ట్‌పోన్ అవుతున్నట్లు ఇంత ప్రచారం జరుగుతున్నా నిర్మాత కనీసం స్పందించకపోవడాన్ని చూస్తుంటే వాయిదా కన్ఫామ్ అని తెలుస్తోంది.

సినిమా ఒక్కటే కాదు… ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా వాయిదా!

తిరుపతిలో ఈ ఆదివారం (జూన్ 8వ తేదీన) ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అయితే సినిమా విడుదల వాయిదా పడడంతో ఆ ఫంక్షన్ కూడా వాయిదా పడింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని తారకరామా స్టేడియంలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

కమల్‏కు చివాట్లు పెట్టిన హైకోర్టు..

థగ్ లైఫ్ సినిమా రిట్ పిటిషన్ పై హైకోర్ట్ సింగిల్ జడ్జి బెంచ్ లో విచారణ జరిగింది. కన్నడ అనేది తమిళం నుంచి పుట్టిందని మీరు ఏ ఆధారంతో చెప్పారు ? మీ మాటల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. మీ వాణిజ్య ప్రయోజనాల కోసం సినిమా తీశారు. ఇప్పుడు మీ తప్పుకు పోలీసులు రక్షణ కల్పించాలా.. ? రూ. 300 కోట్ల విలువైన సినిమా అని మీరు చెబుతున్నారు. అప్పుడు క్షమాపణ చెప్పండి.. ఎలాంటి సమస్య […]

కమల్ హాసన్‌కు తన పుస్తకాలను బహుమతిగా ఇచ్చిన కన్నడ నటి..

లోక నాయకుడు కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పై కన్నడిగుల ఆగ్రహం చల్లారడం లేదు. ఈ వివాదం కొనసాగుతుండగానే ప్రముఖ కన్నడ నటి, దర్శకురాలు, కథా రచయిత్రి రంజని రాఘవన్ తాను రాసిన ‘కథ డబ్బీ’, ‘స్వైప్ రైట్’ పుస్తకాలను కమల్ హాసన్ కు బహుమతిగా ఇచ్చింది. ‘కమల్ సర్ కోసం ఒక కన్నడ పుస్తకం’ అని ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది రంజని. ఇది కమల్ సార్ కు కౌంటరా? లేదా ఆయనపై ఉన్న అభిమానమా?

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON