loader

గ్రాండ్ గా అఖిల్ అక్కినేని, జైనాబ్ రిసెప్షన్

రెండు రోజుల క్రితం వివాహ బంధంతో ఒక్కటైన అక్కినేని అఖిల్, జైనాబ్ గ్రాండ్ రిసెప్షన్ ఇస్తున్నారు. పెళ్లిని మాత్రం కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మాత్రమే చేసిన అక్కినేని కుటుంబం…రిసెప్షన్ కు మాత్రం సినీ, రాజకీయ ప్రముఖులు అందరికీ ఆహ్వానం పలికింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబంతో కలిసి వచ్చి అఖిల్ ను జైనాబ్ ను ఆశీర్వదించారు.

గుంటూరు నగర మాజీ మేయర్‌ కావటి వైసీపీ నుంచి సస్పెండ్

గుంటూరు నగర మాజీ మేయర్‌ కావటి మనోహర్ నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. కమిషనర్‌తో పడటం లేదంటూ … పార్టీకి సమాచారం ఇవ్వకుండా రాజీనామా చేయడంపై, మేయర్ మీద అవిశ్వాసం పెట్టేందుకు కూటమికి బలం లేదని… తెలిసి కూడా మనోహర్ ఎందుకు రాజీనామా చేశారని ఆరా తీసింది. దీంతో మనోహర్, ఆయనతో పాటు ఇద్దరు కార్పొరేటర్లపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది.

ముగిసిన కాకాణి మూడు రోజుల కస్టడీ

అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మూడు రోజుల పాటు అధికారులు విచారించారు. మొదటి రోజు మైనింగ్ కేసుకు సంబంధించి 22 ప్రశ్నలను పోలీసులు సంధించారు. వాటికి సరైన సమాధానం చెప్పలేదట. ఇవన్నీ తప్పుడు కేసులంటూ విచారణ అధికారికి బదులిచ్చారు. కొన్ని ప్రశ్నలకు ఆయన మౌనమే సమాధానం. అవగాహన లేదు, గుర్తులేదు, మర్చిపోయా.. అంటూ కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఇంటర్ విద్యార్థిని కథ విషాదాంతం, కాలిన గాయాలతో డెడ్‌బాడీ

అనంతపురం నగరంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని చనిపోయింది. నాలుగైదు రోజులు కిందట కూతురు కనిపించడం లేదని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నగరంలోని రామకృష్ణ నగర్ కు చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని తన్మయి వారం రోజుల క్రితం అదృశ్యం అయింది. అనుమానాస్పదంగా తన్మయి మృతి చెందింది. తన్మయి తండ్రి లక్ష్మీపతి మాట్లాడుతూ ఓ అబ్బాయి మీద అనుమానం ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. కాల్ లిస్ట్ వచ్చాక […]

కొలంబియా సెనేటర్‌పై కాల్పులు..పరిస్థితి విషమం

ఎన్నికల ప్రచార ర్యాలీ సందర్భంగా బొగోటాలో శనివారం కొలంబియా సెనేటర్ మిగ్యుల్ ఉరిబ్ టర్బే(39)పై కాల్పులు జరిగాయని, ఆయన గాయపడ్డారని అధికారులు తెలిపారు. ‘ఇది ఆమోయోగ్యం కాని హింసాత్మక చర్య’ అని ఆయన కన్జర్వేటివ్ డెమోక్రటిక్ సెంటర్ పార్టీ ఓ ప్రకటన విడుదలచేసింది. ఫోంటిబాన్ పరసర ప్రాంతంలోని పార్క్ వద్ద ఈ దాడి జరిగింది. రక్తమోడుతున్న ఉరిబ్ టర్బేను అనేకులు మోసుకెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సర్కూలేట్ అవుతోంది.

విజయవాడలో నడిరోడ్డుపై కత్తులతో యువకులు హల్‌చల్

విజయవాడలో నడిరోడ్డుపై యువకులు కత్తులతో వీర విహారం చేశారు. గంజాయి బ్యాచ్ పట్టపగలే జనాలపై బీరు బాటిళ్లు విసిరి వీరంగం సృష్టించింది. గంజాయి బ్యాచ్ పిచ్చి చేష్టలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలు ఇబ్బందులకు గురవుతంటే పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే ఈ సంఘటన జరగడంతో ప్రజల్లో మరింత ఆందోళన పెరిగింది.

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల…

ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్‌-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితాలను జేఎన్టీయూ కాకినాడ వీసీ ఆచార్య సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఆదివారం సాయత్రం విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్… https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspxను సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు.

స్కూల్ బీజేపీలో, కాలేజీ చంద్రబాబు వద్ద, ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద..

స్కూల్ బీజేపీలో, కాలేజీ చంద్రబాబు వద్ద, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నానంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ “ప్రజల కథే.. నా ఆత్మకథ” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బండారు దత్తాత్రేయతో అనుబంధాన్ని, ఆయన చేసిన సేవల్ని గుర్తుచేసుకున్నారు.

మళ్లీ అగ్నిగుండంగా మారిన మణిపూర్‌..

గత సంవత్సరం చెలరేగిన జాతుల మధ్య రగిలిన ఘర్షణలు, హింసాయుత ఘటనల నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా కోలుకోకముందే మళ్లీ మణిపూర్‌లో హింస రాజుకుంది. మైతీ తెగ రాడికల్ గ్రూప్ అరమ్‌బాయ్‌ తెన్గోల్‌-ATకి చెందిన ప్రముఖ నాయకుడు కనన్‌ సింగ్ సహా ఐదుగురు నాయకులను అరెస్ట్ చేయడంతో రాజధాని ఇంఫాల్ హింసాత్మకంగా మారింది. మైతీ తెగ యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.

రాహుల్‌గాంధీ ఆరోపణ.. ఘాటుగా స్పందించిన ఈసీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌తో గెలిచిందన్న రాహుల్‌గాంధీ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈసీ అధికారుల మనో ధైరాన్ని దెబ్బతీసే రీతిలో మాట్లాడడం తగదని ఈసీ వివరణ ఇచ్చింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అన్ని వివరాలు ఈసీ వెబ్‌సైట్‌లో ఉన్నట్టు వెల్లడించింది. ఆరోపణలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినప్పటికి మళ్లీ అవే ఆరోపణలు చేయడం తగదని ఈసీ వ్యాఖ్యానించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON