loader

సింగర్ ఆశ భోస్లేకి గుండెపోటు, ఐసీయూలో చికిత్స…

బాలీవుడ్ లెజెండరీ సింగర్ ఆశ భోస్లే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఏప్రిల్ 11, శనివారం ఆశ భోస్లేకి గుండెపోటు రావడంతో ఆమెని ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆశ భోస్లే వయసు 92 ఏళ్లు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా ఎలాంటి రిపోర్ట్ రాలేదు.

పుట్టినరోజు నాడు అల్లు అర్జున్ కి.. గీతా ఆర్ట్స్ అదిరిపోయే గిఫ్ట్!

అల్లు అర్జున్ కేవలం ఒక నటుడిగానే కాకుండా, తన పేరును ఒక గ్లోబల్ బ్రాండ్‌గా మార్చుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు కావడంతో అభిమానుల కోలాహలం మిన్నంటింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆయనకు కెరీర్ ఆరంభం నుండి అండగా ఉన్న గీతా ఆర్ట్స్ సంస్థ ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో అల్లు అర్జున్ సినీ ప్రస్థానం, ఆయన సాధించిన విజయాలను అద్భుతంగా ఆవిష్కరించారు.

హ్యాపీ బర్త్‌డే జయమ్మ.. ‘రణబాలి’ నుంచి రష్మిక మందన్న స్పెష‌ల్ వీడియో

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘రణబాలి’ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఇప్ప‌టికే మైసా నుంచి కొత్త పోస్ట‌ర్ విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుండ‌గా.. తాజాగా ర‌ణ‌బాలి సినిమాలో రష్మిక పోషిస్తున్న ‘జయమ్మ’ పాత్రకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేసింది.

వరుణ్ తేజ్ కొత్త సినిమా షురూ: క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్

మెగా కుటుంబం నుంచి మరో ఆసక్తికరమైన ప్రాజెక్టు పట్టాలెక్కింది. అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా, చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మాతగా సరికొత్త చిత్రం శనివారం (మార్చి 28) హైదరాబాద్‌లో వైభవంగా ప్రారంభమైంది.ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి ఆయన క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు తన ఆశీస్సులు అందజేశారు. నిహారిక తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై ఈ […]

గాయంతోనే సెట్స్‌లో అడుగుపెట్టిన‌ రామ్ చరణ్.. ఫ్యాన్స్‌తో సెల్ఫీ వీడియో!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అంకితభావంతో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. ‘పెద్ది’ షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్ చేస్తూ చరణ్‌కు గాయమైన సంగతి తెలిసిందే. ఆ గాయానికి చిన్న సర్జరీ కూడా జరిగినప్పటికీ, మార్చి 27న, తన పుట్టినరోజు సందర్భంగా చరణ్ మళ్లీ సెట్స్‌లో కనిపించడం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ అయింది. కంటిపైన బ్యాండేజ్ ఉన్నప్పటికీ, ఆయన ముఖంలో ఎలాంటి అసౌకర్యం కనిపించలేదు

రామ్‌ చరణ్‌ కంటికి సర్జరీ.. వైద్యుడికి చిరంజీవి కృతజ్ఞతలు

రామ్ చరణ్ ‘పెద్ది’ షూటింగ్లో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన కంటికి చిన్న సర్జరీ జరిగినట్లు చిరంజీవి సోషల్ మీడియాలో వెల్లడించారు. చరణ్ కు సర్జరీ చేసిన వైద్యులకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.సర్జరీ గురించి చిరంజీవి స్పందిస్తూ.. “చరణ్ కనురెప్పకు మీరు సరైన సమయంలో, ఎంతో నైపుణ్యంతో సర్జరీ చేసినందుకు ధన్యవాదాలు. మొదట మాకు కొంత ఆందోళన కలిగినప్పటికీ, మీ మాటలు భయాన్ని పోగొట్టి ధైర్యాన్నిచ్చాయి” అని చిరంజీవి తన పోస్ట్లో రాసుకొచ్చారు.

పెద్ది షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయం..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్ర షూటింగ్‌లో ఒక చిన్న ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం, షూటింగ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఉండగా రామ్ చరణ్ కంటి సమీపంలో చిన్నపాటి గాయమైంది. అయితే, దీనిపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కేవలం స్వల్ప గాయం మాత్రమేనని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ భేటీ…ఈ ప్రాజెక్టులపై చర్చ

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సంజయ్ దత్ ముఖ్యమంత్రికి వివరించారు. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నామని సంజయ్ దత్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సంజయ్ […]

కొత్త సినిమాలకు బ్రేక్‌.. పవన్‌ కల్యాణ్‌ టీం ఏం చెప్పిందంటే..?

పవన్‌ కల్యాణ్ నయా సినిమాలకు గ్రీన్ సిగ్నల్‌ ఇస్తున్నాడని..వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి పవన్‌ కల్యాణ్‌ ఎలాంటి కొత్త ప్రాజెక్టుల కమిట్‌మెంట్స్‌ను తీసుకోవడం లేదు. కొత్త సినిమాలపై వస్తున్న పుకార్లు అవాస్తవం. ఇప్పటికైతే కొత్త సినిమాలను మొదలుపెట్టే ప్లాన్ ఏం లేదు. అలాంటిది ఏదైనా అప్‌డేట్ ఉంటే అధికారిక ఛానళ్ల ద్వారా మీకు చేరవేస్తాం. ఓజీ 2 విషయంలో ఏదైనా అప్‌డేట్ ఉంటే సరైన సమయంలో పవన్‌ కల్యాణ్‌ స్వయంగా తెలియజేస్తారని పవన్‌ కల్యాణ్ టీం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON