loader

‘టాక్సిక్’ వివాదంపై సెన్సార్ బోర్డు క్లారిటీ.. యూట్యూబ్ వీడియోలకు మా అనుమతి అక్కర్లేదు!

‘టాక్సిక్‌’ సినిమా టీజ‌ర్‌లో అశ్లీలత‌తో పాటు అభ్యంతరకర సన్నివేశాల పై తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్. టీజర్‌లోని అభ్యంతరకర దృశ్యాలను పరిశీలించి, చర్యలు తీసుకోవాల్సిందిగా సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. అయితే ఈ వివాదంపై సెన్సార్ బోర్డు తాజాగా స్పందించింది. యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలయ్యే కంటెంట్‌కు సెన్సార్ సర్టిఫికేషన్ అవసరం లేదని తెలిపింది. కేవలం థియేటర్లలో ప్రదర్శించే టీజర్లు, సినిమాలకు మాత్రమే సెన్సార్ అనుమతి తప్పనిసరని, ‘టాక్సిక్’ టీజర్ నేరుగా డిజిటల్ మాధ్యమాల్లో రావడంతో […]

‘జననాయగన్’ వాయిదాపై రాహుల్ గాంధీ ఫైర్.. ప్రధాని మోదీపై విమర్శలు

విజయ్ తమిళనాడులో రాజకీయ పార్టీ స్తాపించిన నేపథ్యంలో ‘జననాయగన్’ మూవీ వాయిదా అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సినిమాను అడ్డుకోవడం అంటేనే తమిళ సంస్కృతిపై దాడి చేయడమే అని రాహుల్ అన్నారు. ‘‘ ‘జననాయగన్’ సినిమాను అడ్డుకోవడం ద్వారా కేంద్ర సమాచార, ప్రసార శాఖ తమిళ సంస్కృతిపై దాడి చేస్తోంది. మోదీ గారు.. తమిళ ప్రజల్ని అణచివేయాలనే మీ ప్రయత్నాలు సఫలం […]

‘టాక్సిక్’ టీజర్‌పై వివాదం.. రంగంలోకి మహిళా కమిషన్!

క‌న్న‌డ స్టార్ న‌టుడు యశ్‌ హీరోగా, మహిళా దర్శకురాలు.  గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘టాక్సిక్‌’ చిత్రం ప్ర‌స్తుతం వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా టీజ‌ర్‌లో అశ్లీలత‌తో పాటు అభ్యంతరకర సన్నివేశాలు ఎక్కువ‌గా ఉన్నాయంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. టీజర్‌లోని దృశ్యాలు పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపేలా ఉన్నాయని, తక్షణమే ఈ టీజర్‌ను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

కరూర్‌ తొక్కిసలాట కేసు.. ముగిసిన విజయ్‌ సిబిఐ విచారణ

తమిళనాడులో తీవ్ర విషాదం మిగిల్చిన కరూర్‌ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్‌, నటుడు విజయ్‌ సిబిఐ విచారణ ముగిసింది. విచారణ కోసం సోమవారం విజయ్, ఢిల్లీలోని సిబిఐ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు ఆరు గంటలపాటు సిబిఐ ఆయనను ప్రశ్నించింది. విచారణ అనంతరం ఆయన తిరిగి వెళ్లిపోయారు.ఇప్పటికే తమిళగ వెట్రి కజగం (టీవీకే) కు చెందిన పలువురు ఆఫీసు బేరర్లను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. దీంతో ఈ కేసులో సిబిఐ.. చార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం

టాలీవుడ్ స్టార్ హీరో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అరుదైన, ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన అంకితభావానికి నిదర్శనంగా, ‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి ఫిఫ్త్ డాన్ పురస్కారం, ‘టకెడా షింగెన్ క్లాన్’లో తొలి తెలుగు వ్యక్తిగా ప్రవేశం పొందారు.

‘జన నాయగన్’కు ఊహించని అడ్డంకి …సెన్సార్ సర్టిఫికేట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘జన నాయగన్’ కు మద్రాస్ హైకోర్టు నుంచి షాకింగ్ పరిణామం ఎదురైంది. ఈ సినిమాకు తక్షణం సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై మద్రాస్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి శ్రీవాత్సవ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఆస్కార్ అకాడమీలో ‘భ్రమయుగం’.. లాస్ ఏంజెల్స్‌లో మమ్ముట్టి మూవీ స్పెషల్ స్క్రీనింగ్!

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ ‘భ్రమయుగం’ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అకాడమీ మ్యూజియంలో ఈ సినిమా ప్రదర్శితం కాబోతుంది. లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియంలో ఫిబ్రవరి 12న నిర్వహించనున్న “వేర్ ద ఫారెస్ట్ మీట్స్ ద సీ”  అనే ప్రత్యేక వేడుక‌లో ఈ సినిమా ప్రదర్శన కాబోతుండ‌గా.. ఈ వేడుక‌కు ఎంపికైన ఏకైక భారతీయ సినిమాగా ‘భ్రమయుగం’ రికార్డు సృష్టించింది. ఈ సిరీస్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ చిత్రాలను ప్రదర్శించ‌బోతున్నారు.

ఆస్కార్ బరిలోకి ‘కాంతార ఛాప్టర్ 1’,‘మహావతార్ నరసింహా’, ‘తాన్వీ’ సినిమాలు..

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్ 1’ మూవీ, ఆస్కార్ ఎంట్రీ దక్కించుకుంది. 98వ అకాడమీ అవార్డుల్లో భాగంగా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరి కోసం 201 సినిమాలు ఎంట్రీ దక్కించుకున్నాయి. సంచలన విజయం అందుకున్న యానిమేటెడ్ మూవీ ‘మహావతార్ నరసింహా’ కూడా బెస్ట్ యానిమేటెడ్ మూవీ కేటగిరి కోసం ఆస్కార్ నామినేషన్స్‌లో నిలిచింది.. ‘కన్నప్ప’‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘పుష్ప 2’ వంటి సినిమాలు ఆస్కార్ నామినేషన్లను ఎంపిక చేసే కమిటీ చె తిరస్కరించబడ్డాయి..

లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌తో సమంత గ్రాండ్ రీఎంట్రీ…

పెళ్లి తర్వాత కొంత విరామం తీసుకున్న స్టార్ హీరోయిన్ సమంత, ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీలో నటిస్తూ సుదీర్ఘ విరామం అనంతరం ఆమె బిగ్ స్క్రీన్‌పై రీఎంట్రీ ఇవ్వనుంది. సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా టీజ‌ర్ ట్రైల‌ర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేయగా, అది అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సమంత పూర్తిగా మాస్ అవతార్‌లో కనిపించారు.

‘జన నాయగన్’ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ – మద్రాస్ హైకోర్టు ఆదేశం!

తమిళ సూపర్ స్టార్, TVK పార్టీ అధ్యక్షులు ద‌ళ‌ప‌తి విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊర‌ట లభించింది. విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో నెలకొన్న వివాదానికి తెరదించుతూ మ‌ద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. గతంలో సెన్సార్ బోర్డు (CBFC) ఈ చిత్రంలోని కొన్ని రాజకీయ సన్నివేశాలు మరియు డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ‘A’ సర్టిఫికేట్ ఇవ్వాలని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON