loader

పాప్ దిగ్గజం బయోపిక్.. ‘మైఖేల్’ ట్రైలర్ విడుదల

పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘మైఖేల్’ (Michael). ఈ సినిమా ట్రైల‌ర్‌ను తాజాగా చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషిస్తుండటం విశేషం. ట్రైలర్‌లో జాఫర్ తన నటన, డ్యాన్స్ మూమెంట్స్ మరియు బాడీ లాంగ్వేజ్‌తో అచ్చం మైఖేల్ జాక్సన్‌ను గుర్తు చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు.

మళ్లీ తాతనయ్యా..ఈ సంతోషం వెలకట్టలేనిది- మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగం!

రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు ఈ శుభవార్తను అపోలో హాస్పిటల్ వద్ద చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘చాలా చాలా సంతోషంగా ఉంది. కొణిదెల ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీ అందరం ఎంతో ఆనందంగా ఉన్నాం. ఉపాసనతో పాటు బిడ్డలిద్దరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు’’ అని చిరంజీవి తెలిపారు. భగవంతుడి దయతో, హనుమాన్ కృప వల్ల ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ జన్మించారని చెప్పారు. మళ్లీ తాతని కావడం చాలా సంతోషంగా […]

కవల పిల్లలకు జన్మనిచ్చిన రామ్ చరణ్ దంపతులు

సినీ నటుడు రామ్ చరణ్ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. దీంతో మెగా కుటుంబం ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఉపాసన మగ, ఆడ శిశువులకు జన్మనిచ్చారని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, తన కుటుంబంలోకి కొత్త సభ్యులు రావడం అనేది తాత నానమ్మలుగా మాకు చాలా ఆనందంగా ఉందని, ఇది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమని తెలిపారు.

500 డ్యాన్సర్ల కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్

టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మాత్రమే కాదు, మానవతా విలువలతో కూడిన సేవా కార్యక్రమాల ద్వారా కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లోని సుమారు 500 మంది సభ్యులు, వారి కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించేందుకు ముందుకు వచ్చారు. గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, ఈ హెల్త్ కార్డుల పంపిణీకి  ఆయన ఆమోదించారు. ఈ పథకం కోసం రామ్ చరణ్ సుమారు రూ.50 […]

పోలీసులకు కౌశిక్ రెడ్డి క్షమాపణలు

తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ కొందరు.. మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని, తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ఆ ఫ్రస్టేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారాను. అంతే తప్ప ఉద్దేశ్య పూర్వకంగా అన్న మాటలు కావు. నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను. అని అభ్యర్థిస్తూ కౌశిక్ […]

అఫీషియల్.. ‘వారణాసి’ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన రాజ‌మౌళి

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న పాన్-వరల్డ్ మూవీ ‘వారణాసి’ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని రాజ‌మౌళి ఎక్స్ వేదిక‌గా అధికారికంగా ప్ర‌క‌టించాడు. ఈ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 07 2027న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు తెలిపాడు. రాజమౌళి మార్క్ ప్రమోషన్లు ఇప్పటి నుంచే మొదలవ్వడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను సృష్టిస్తుందోనని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. ప్రత్యేక అతిథిగా ఏఆర్ రెహమాన్

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన ‘మెలానియా’ డాక్యుమెంటరీ ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్‌గా మారింది. వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మక కెన్నడీ సెంటర్ లో ఈ డాక్యూమెంట‌రీ ప్రీమియ‌ర్‌ను ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. అయితే ఈ హై-ప్రొఫైల్ ఈవెంట్‌కు భారతీయ సంగీత మాంత్రికుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రెహమాన్ కు ఉన్న విశేష గుర్తింపు నేపథ్యంలో ఆయనను ఈ వేడుకకు ఆహ్వానించిన‌ట్లు […]

అంజనా దేవి పుట్టినరోజున చిరంజీవి భావోద్వేగ సందేశం

తల్లి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి చేసిన భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు అభిమానులను హత్తుకుంటోంది. ఈరోజు (జనవరి 29) అంజనా దేవి పుట్టినరోజు కావడంతో, చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “అమ్మా.. నీ ఆశీర్వాదమే నా బలం. పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ ఎమోషనల్ మెసేజ్‌ను పంచుకున్నారు. ఈ సందేశంతో పాటు ఒక ప్రత్యేక వీడియోను కూడా అభిమానులతో షేర్ చేశారు.

మెట్రోలో మాస్ స్టంట్స్… వరుణ్ ధావన్‌కు ముంబై మెట్రో స్ట్రిక్ట్ వార్నింగ్

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్  మూవీ ‘బోర్డర్ 2’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ముంబై మెట్రో కోచ్‌లో పైభాగంలో ఉన్న మెటల్ రాడ్‌ను పట్టుకుని పుల్-అప్స్   వీడియోలు వైరల్ కావడంతో మెట్రో కోచ్‌లలో ఉన్న గ్రాబ్ హ్యాండిల్స్, మెటల్ రాడ్స్ అన్నీ ప్రయాణికుల భద్రత కోసం మాత్రమే. అవి ఫిట్‌నెస్ స్టంట్స్ లేదా విన్యాసాల కోసం కావు. ఇలాంటి ప్రవర్తన ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కలిగిస్తే శిక్షార్హులు. జరిమానాలు లేదా జైలు శిక్ష కూడా పడొచ్చు” అని […]

చిరంజీవి వ్యాఖ్యలపై రవితేజ ఫ్యాన్స్ ఫైర్ .. అస‌లు వివాదం ఏంటి ?

దాదాపు అన్ని సినిమాలు ప్రజల ఆదరణ పొందాయి. ఒకటి అరా అటు ఇటుగా ఉన్నా కూడా ఇది మంచి సంక్రాంతి” అన్న చిరంజీవి వ్యాఖ్యలు ఒకటి అరా అటు ఇటుగా’ అనే మాటలు రవితేజ సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ను ఉద్దేశించినవేనని కొందరు రవితేజ అభిమానులు భావించారు. దీంతో సోషల్ మీడియాలో చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. తమ హీరో సినిమా రిజల్ట్‌ను బహిరంగ వేదికపై ప్రస్తావించారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON