సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న పాన్-వరల్డ్ మూవీ ‘వారణాసి’ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని రాజమౌళి ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 07 2027న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపాడు. రాజమౌళి మార్క్ ప్రమోషన్లు ఇప్పటి నుంచే మొదలవ్వడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను సృష్టిస్తుందోనని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

