రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు ఈ శుభవార్తను అపోలో హాస్పిటల్ వద్ద చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘చాలా చాలా సంతోషంగా ఉంది. కొణిదెల ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీ అందరం ఎంతో ఆనందంగా ఉన్నాం. ఉపాసనతో పాటు బిడ్డలిద్దరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు’’ అని చిరంజీవి తెలిపారు. భగవంతుడి దయతో, హనుమాన్ కృప వల్ల ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ జన్మించారని చెప్పారు. మళ్లీ తాతని కావడం చాలా సంతోషంగా ఉందని, దీన్ని వెలకట్టలేమని అన్నారు.

