‘ఎంపురాన్’ నిర్మాతపై ఈడీ దాడులు
మలయాళ సినిమా ‘ఎంపురాన్’ నిర్మాత గోకులం గోపాలన్ కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా దాడులు చేపట్టింది. చెన్నై, కొచ్చి, కర్ణాటకలలో ఆయనకు సంబంధించిన ఐదు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపి కీలక పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. చెన్నైలో జరిపిన సోదాల్లో రూ.1.5 కోట్ల నగదును ఈడీ సీజ్ చేసినట్టు తెలిసింది. అక్రమ నగదు లావాదేవీలతో వచ్చిన నిధులను ఉపయోగించి ‘ఎంపురాన్’ సినిమా తీశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.