బీజేపీ దేశాన్ని ‘నియంతృత్వం’ వైపు తీసుకెళ్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాష్ట్రాలకు సమాన వాటా, సీట్ల ఫ్రీజింగ్ అనేది సమస్యే కాదు. 850 అనే సంఖ్య ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంది. నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్‌కుమార్‌కు ఒక ఖాళీ కాన్వాస్ ఇచ్చి, దేశ నియోజకవర్గాల మ్యాప్‌ను తమకు నచ్చినట్లుగా మళ్లీ గీసుకోవడానికి అవకాశం ఇవ్వడమే ఈ బిల్లు ఉద్దేశం. రాజ్యాంగ సవరణ 850 లోక్‌సభ సీట్ల సంఖ్య దేశ ప్రజాస్వామ్య హత్య’కు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.