రష్యాలో భూకంపం సంభవించింది. కమ్చట్కా ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.7గా తీవ్రత నమోదైంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.45 గంటల సమయంలో ఈ భూకంపం వచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదు. 205 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు భారత ఏజెన్సీ అంచనా వేసింది. యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం దీని లోతు 188 కిలోమీటర్లుగా పేర్కొంది. కమ్చట్కా ద్వీపకల్పంలోని యెలిజోవోకు ఉత్తర వాయువ్యంగా 62 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉంది.