ఉత్తరప్రదేశ్లోని ప్రఖ్యాత కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU)లో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు సీనియర్ల ముందు తలవంచి ‘ప్రణామ్ మహోదయ్’ అంటూ నమస్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం బయటపడింది. దీనిని తీవ్రంగా పరిగణించిన వర్సిటీ యాజమాన్యం 38 మంది విద్యార్థులను మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున జరిమానా విధించడంతో పాటు, ఏడాది పాటు స్కాలర్షిప్లను నిలిపివేస్తూ కఠిన ఉత్తర్వులు జారీ చేసింది.