డీలిమిటేషన్ బిల్లు కేవలం చట్టపరమైన సంస్కరణ మాత్రమే కాదని, దేశ నిర్మాణంలో మహిళలకు సముచితస్థానం కల్పించే నిర్ణయాత్మక అడుగు అని బీజేపీ పేర్కొంది. భారతీయ ‘నారీశక్తి’కి ఇచ్చిన హామీని నెరవేర్చే సమయం ఆసన్నమైందని తెలిపింది. రాష్ట్రాల్లో లోక్సభ సీట్లను 50శాతం పెంచేందుకు ఉద్దేశించిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని అమిత్ షా ఎక్స్ వేదికగా కోరారు. శుక్రవారం కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో దేశంలోని మహిళల దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుందని పేర్కొన్నారు.

