సంతాన లేమితో బాధపడుతున్నవారి ఆశలను ఆసరాగా చేసుకుని, పేద యువతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ అండాల దందా కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హైదరాబాద్ వేదికగా సాగుతున్న చీకటి సామ్రాజ్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ సంస్థ దేశవ్యాప్తంగా నడుపుతున్న 43 క్లినిక్ల ద్వారా ప్రతినెలా దాదాపు 600 సెల్ఫ్-సైకిల్స్, 100 అండాల డోనర్ సైకిల్స్ జరుగుతున్నాయని, తద్వారా నెలకు రూ.27 నుంచి రూ.28 కోట్ల మేర ఆదాయం వస్తోందని మల్కాజిగిరి సీపీ సుమతి తెలిపారు.

