ఆంధ్రప్రదేశ్‌లో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యవహారశైలి ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా ఆగ్రహానికి ఐదుగురు టోల్‌ప్లాజా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. విజయవాడ బైపాస్‌లోని వెంకటపాలెం టోల్‌ప్లాజా వద్ద నిబంధనల ప్రకారం టోల్ ఫీజు చెల్లించాలని లేదా మినహాయింపునకు సంబంధించిన గుర్తింపు కార్డు చూపించాలని అడిగినందుకే ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

