దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గకుండా రక్షణ కల్పించాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కోరారు. డీలిమిటేషన్ అంశంపై తమ పార్టీ వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉందని అన్నారు. తెలంగాణకు జరిగే ఏ అన్యాయాన్ని సహించబోమని, 2051 వరకు అంతర్రాష్ట్ర ప్రాతినిధ్య నిష్పత్తిలో మార్పులు లేకుండా రక్షణ కల్పించాలని కెటిఆర్ కోరారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాలను 26కు పెంచే ప్రతిపాదన ఉందని, మహిళా రిజర్వేషన్లకు తమ పార్టీ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని కెటిఆర్ పేర్కొన్నారు.

