2025 సంవత్సరానికి గాను నంది టీవీ ఫిల్మ్ అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నంది టీవీ ఫిల్మ్ అవార్డుల (2025) జ్యూరీ కమిటీ ఛైర్మన్‌గా కొమ్మనాపల్లి గణపతిరావును నియమించారు. అలాగే జ్యూరీ సభ్యులుగా రూప దేవి, కోట శంకరరావు, సుబ్బరాయ శర్మ, ఉదయభాను నియామకం జరిగింది. వీరితో పాటు అనితా చౌదరి, సనా, కె.వి.ఎస్. దుర్గలను జ్యూరీ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. జ్యూరీ కన్వీనర్‌గా APSFTVTDC మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.