ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ మరో సంచలన ప్రాజెక్టుకు సిద్ధమైంది. భూమిపై మాత్రమే కాకుండా అంతరిక్షంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) అనుమతి పొందింది. ఏకంగా 10 లక్షల ఉపగ్రహాలతో ‘స్టార్మైండ్’ (Starmind) పేరుతో భారీ శాటిలైట్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు స్పేస్ఎక్స్కు ఎఫ్‌సీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ మొత్తంలో డేటాను అంతరిక్షంలోనే ప్రాసెస్ చేసి, అవసరమైన సమాచారాన్ని తిరిగి భూమికి పంపిస్తారు.