రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ, మలి దశ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టిందని ఐజీ (రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్) బి. రాజకుమారి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు 607 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని.. 213 మంది అరెస్ట్ చేశామని.. 1,785 మందికి నోటీసులు జారీ చేశామని చెప్పారు. 1,41,687 మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.