ఎపిలో పంచాయతీ ఎన్నికల్లో చెరగని సిరా వినియోగంపై ఎస్ఇసి ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు ఎడమచేతి చిటికెన వేలుపై సిరా వేస్తారని తెలిపింది. ఇటీవల ఎంపిటిసి, జడ్పిటిసి, ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు వేశారు. పోలింగ్లో మార్పులు, రీపోలింగ్ వల్ల కొన్ని కేంద్రాల్లో ఎడమ చేతి మధ్య వేలుపైనా సిరా గుర్తుకు ఆదేశమిచ్చారు. అప్పటి సిరా గుర్తు ఓటర్ల వేళ్లపై ఇంకా ఉన్నందున ఎస్ఇసి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

