భారత పారా ఆర్చరీ స్టార్ శీతల్ దేవికి ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ కానుక ఇచ్చింది. ఇటీవల జపాన్‌లో జరిగిన 2026 ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించిన ఆమెకు కొత్త బేయాన్ ఎస్యువి కారును కానుకగా అందంిచింది. నవంబర్ 25న గురుగ్రామ్‌లో జరిగిన కార్యక్రమంలో శీతల్‌కు హ్యుందాయ్ మోటర్ ఇండియా ప్రతినిధులు కారును అందజేశారు. రెండు నెలల క్రితమే ఆమెను హ్యుందాయ్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన విషయం తెలిసిందే.