ఏపీలో మరో రాజకీయ పాదయాత్రకరు ముహూర్తం కుదిరింది. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు విజయ సాయిరెడ్డి ప్రకటించారు. కొద్ది రోజుల క్రితమే విజయసాయిరెడ్డి సొంత పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ, గ్రామాల్లో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ సాగుతుందని తమ పార్టీలో యువతకే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ మునుపెన్నడూ లేని విధంగా రాజకీయాల్లో సరికొత్త విప్లవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.