ఏపీలో రెండో విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 4 మేయర్ స్థానాలు, 19 ఛైర్పర్సన్ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో ఏదీ ఏకగ్రీవం కాకపోవడంతో అన్ని స్థానాలకు పోలింగ్ జరుగనుంది. 4 మేయర్ పదవుల కోసం 36 మంది, 19 ఛైర్పర్సన్ పదవుల కోసం 134 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1,010 వార్డు సభ్యుల స్థానాల్లో 41 వార్డులు ఏకగ్రీవం అవగా.. మరో 5 వార్డుల్లో పోటీ లేకపోవడంతో 964 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు.

