హైదరాబాద్ నగరంలో దాడులు చేస్తామని ఉగ్రవాదులు ఒక ఈ-మెయిల్ పంపించారని పోలీసులు జారీ చేసిన మెస్సేజ్ బయటకు ఎలా లీక్ అయిందని బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన పోలీసుల సర్క్యులర్.. అన్ని సోషల్ మీడియాల్లో ఎలా వైరల్ అయిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఈ సమాచారం బయటకు తెలిస్తే.. ప్రజలు అనవసర గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక.. హైదరాబాద్ సీపీ అది ఫేక్ ఈ-మెయిల్ అని ప్రకటించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.