మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యపై ఆయన కుమారుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ‘ఆయన చనిపోవాలనే భద్రతను తొలగించారు. అదేం అకస్మాత్తుగా జరిగిందేం కాదు. ప్రణాళిక ప్రకారమే, హత్య జరిగేందుకు అనుకూలమైన వాతావరణం సృష్టించారు.1991లో రాజీవ్ గాంధీ బీహార్ పర్యటనకు వెళ్లినప్పుడు రాళ్ల దాడి జరిగింది. ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీని తగ్గించేశారు.తన తండ్రి భద్రత విషయంలో ఇక నుంచి జాగ్రత్తలు తీసుకోకపోతే ఆయన అంత్యక్రియలకు రావాల్సి వస్తుందని నేను స్వయంగా అమ్మ సోనియా గాంధీకి చెప్పాను’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.