పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీకి అత్యంత పాత మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ తిరిగి NDA కూటమిలో చేరింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నితిన్ నబీన్, మరియు శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేసినట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది.