బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. నవంబర్ 24 నుంచి రానున్న రోజుల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని అంచనా వేసింది. తెలంగాణలో కూడా నవంబర్ 24, 25 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది