పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్లో ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాధారణ భక్తులతో పాటు నేలపై కూర్చుని సాయిపల్లవి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కళ్లు మూసుకుని, పూర్తి భక్తిపారవశ్యంతో భజనలు ఆలపిస్తున్న ఆమె వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రతి ఏటా నూతన సంవత్సరంతో పాటు ముఖ్యమైన పర్వదినాల్లో ఆమె పుట్టపర్తిని సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. తనకు ‘సాయి’ అని పేరు పెట్టింది సాక్షాత్తూ సత్యసాయిబాబానేనని ఆమె గతంలో ఎన్నోసార్లు గర్వంగా చెప్పారు.

