2024 అసెంబ్లీ,లోక్సభ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్సీపీ సంచలన ట్వీట్ చేసింది. చిత్తూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల అక్రమాలపై ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ప్రముఖ ఇన్వెస్టిగేటీవ్ మీడియా సంస్థ ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ 2024 పోలింగ్ అక్రమాలను సోమవారం (నవంబర్ 11న) బయటపెట్టింది. ఆ వివరాలను ఉటంకిస్తూ వైఎస్సార్సీపీ పోస్టు చేసింది. 31,471ఓట్లు ఎక్కడికి పోయాయో? అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా నాటి ఎన్నికల కౌంటింగ్ అనంతరం ప్రెస్మీట్లో మాట్లాడిన.. వైఎస్ జగన్ వీడియోను కూడా వైఎస్సార్సీపీ పోస్టు చేసింది.