మాజీ మంత్రి హరీశ్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీశ్ రావుకు అసలైన రాజకీయ గురువు కేసీఆర్ కాదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. 2004లో వైఎస్సార్ మంత్రివర్గంలో హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వైఎస్సార్‌కు హరీశ్ రావు గురుదక్షిణ ఇచ్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.

