కృష్ణా జలాల పంపిణీపై ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి ఏకాభిప్రాయం కుదరలేదు. హైదరాబాద్లో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. తమ రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాల దృష్ట్యా కృష్ణా జలాల కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు తమ తమ వాదనలను బలంగా వినిపించడంతో భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నీటి విడుదల అంశంతో పాటు పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది.

