ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్లో అసదుద్దీన్ ఒవైసీ వాహనాల కాన్వాయ్‌తో సహారన్పూర్ సర్క్యూట్ హౌస్‌కు చేరుకున్నారు. కాన్వాయ్‌లో దిగిన ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా భావించిన పోలీసులు ఆయనకు ‘గార్డ్ ఆఫ్ హానర్’ సమర్పించారు. కొంత సమయం తర్వాత గానీ, తాము గౌరవ వందనం చేసింది సుప్రీంకోర్టు జడ్జికి కాదని, ఒవైసీకి అని పోలీసులకు అర్థం కాలేదు. ఈ ఘటనపై సహారన్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) అభినందన్ విచారణకు ఆదేశించారు. ఇది కేవలం పొరపాటు మాత్రమేనా లేక ఉద్దేశపూర్వకంగానే చేశారా అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.