“బిస్లరీ వాటర్” సురక్షితమేమీ కాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) స్పష్టం చేసింది. బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలు పరీక్షించిన FSSAI.. బిస్లరీ ప్యాకేజ్డ్ వాటర్లో పరిమితికి మించి బ్రోమైట్ ఉన్నట్లు వెల్లడించింది. బిస్లరీ కంపెనీ అప్పీల్ చేయడంతో ఫుడ్ ల్యాబ్లో మరోసారి పరీక్షలు జరిపారు. ల్యాబ్ పరీక్షల్లో నీటిలో పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఉన్నట్లు గుర్తించారు. బిస్లరీ వాటర్ విషయంలో ఆహార భద్రతా చట్టాల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధరణ అయింది.