అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో జన చైతన్యలో సభ కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని హామీ ఇచ్చారని, కనీసం లక్షాధికారులను చేయాలని సూచించారు. కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే రాజకీయం వదిలేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. వరంగల్లో కనీసం వెయ్యి ఉద్యోగాలైనా కల్పించాలనే ఉద్దేశంతో 4 ఐటీ కంపెనీలు తెచ్చామని పేర్కొన్నారు.