వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్ కేఎల్ రాహుల్(136) భారీ సెంచరీతో కదం తొక్కగా.. యశస్వి జైశ్వాల్(85), దేవ్దత్త్ పడిక్కల్(80), శుబ్మన్ గిల్(98), రిషబ్ పంత్(55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 486 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విదేశీ గడ్డపై జరిగిన టెస్టు ఇన్నింగ్స్లో భారత్కు చెందిన టాప్-ఆర్డర్ బ్యాటర్లు ఐదుగురూ అర్ధశతకాలు సాధించడం గత 94 ఏళ్లలో ఇదే మొదటిసారి.