తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. టీడీపీ దాడి ఘటనలో పెద్దారెడ్డి ఇంటి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. ఆయనకు చెందిన 10 స్కార్పియో వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు సుమారు 20 బైక్‌లకు నిప్పు పెట్టారు. దీంతో, భారీగా ఆస్తి నష్టం జరిగింది.