దేశీయ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం కూడా పసిడి, వెండి ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. హైదరాబాద్‌లో గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,480 ఉండగా, శుక్రవారం నాటికి రూ.5,320 తగ్గి, రూ.1,28,160కు చేరుకుంది. ముంబయి, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరుల్లోనూ ఇవే ధరలు ట్రేడ్ అవుతున్నాయి. ఆభరణాల తయారీల 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,800గా నమోదైంది. కిలో వెండి ధర రూ.1,64,865 ఉండగా, శుక్రవారం నాటికి రూ.9,965 తగ్గి, రూ.1,54,900కు చేరుకుంది.