కోకాపేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి కోకాపేట వైపు వెళ్తున్న కారు.. ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. అప్రమత్తమైన వారు వెంటనే కారు నుంచి బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.